హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు రాత్రి 7 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై తుది నిర్ణయం కోసం కసరత్తులు చేస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రిని ఢిల్లీకి రావాలని ఆదేశించినట్లు సమాచారం. శుక్రవారం జరిగే కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. శనివారం కూడా ఆయన ఢిల్లీలోనే ఉంటారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రైల్వే మంత్రి మమతాబెనర్జీ, ఇతర కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి