* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

20, జనవరి 2011, గురువారం

నక్కపల్లిలో మరో భారీ పరిశ్రమ

ముందుకొచ్చిన అమెరికా బ్రైటన్‌ సంస్థ
నక్కపల్లి(విశాల విశాఖ): పెట్రో కెమికల్‌ పెట్రోలియం ఇన్వెస్టిమెంట్‌ రీజియన్‌లో (పీసీపీఐఆర్‌) భాగంగా మండలంలో ప్రత్యేక పరిశ్రమల పార్కు ఏర్పాటు చేస్తున్నారు. పలు అంతర్జాతీయ సంస్థలు ఇందులో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే మండలంలో పలువురు విదేశీ ప్రతినిధులు ఇక్కడి భూములను పరిశీలించి వెళ్లారు. తాజాగా ఓ విదేశీసంస్థకు సంబంధించి నక్కపల్లి మండలంలో 800 ఎకరాల్లో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుందని మంత్రి గీతారెడ్డి ముఖ్యమంత్రితో కలిసి ప్రకటించడంతో అందరి దృష్టి దీనిపై మరలగా, అన్నదాత గుండెల్లో గుబులు రేపుతోంది.మండలంలో ఇప్పటికే దాదాపు 2500 ఎకరాల జిరాయితీ భూమికి సంబంధించి రైతులకు నోటీసులు జారీచేసి గ్రామాల్లో ప్రజాభిప్రాయ సదస్సులు ఏర్పాటు చేశారు. దీనిపై అన్నదాతల నుంచి వ్యతిరేక వచ్చినా సేకరణ ప్రక్రియ ఏమాత్రం ఆగలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలిపి మొత్తం సుమారుగా 4500 ఎకరాలు గుర్తించారు. ఇప్పటికే రాజయ్యపేట వద్ద ఆన్‌రాక్‌ సంస్థకు చిన్న తరహా ఒడరేవు నిర్మించుకోడానికి అనుమతిచ్చారు. తాజాగా అమెరికాకు చెందిన బ్రైటన్‌ సంస్థ రాష్ట్రంలో అణువిద్యుత్తు యంత్ర పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చింది. అధికారకంగా ప్రభుత్వం ఈ సంస్థకు మాత్రమే అనుమతిని ఇచ్చింది. దీంతో పీపీపీఐఆర్‌లో తొలి పరిశ్రమ ఇదే కానుంది. రూ. 2880 కోట్లు పెట్టుబడి పెట్టడంతో పాటు రెండేళ్ల కాలంలో నిర్మాణాన్ని పూర్తిచేసి లక్ష మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఈ సంస్థ ప్రభుత్వానికి వివరించింది. ఇదే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
అనుకూల పరిస్థితులు ఇవీప్రధానంగా మండలం తీరాన్ని ఆనుకుని ఉండటంతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు అధికంగా ఉన్నాయి. దీంతో రసాయన పరిశ్రమలు ఏర్పాటుచేస్తే తప్పనిసరిగా తీరం అవసరం. మండలంలో తీరానికి జాతీయ రహదారి 5 నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దగ్గర్లో తుని, నర్సీపట్నం రోడ్డు వంటి రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి ద్వారా ఇక్కడకు ప్రత్యేక రైలు మార్గాలు ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. మండలంలోని తీరప్రాంత గ్రామాలకు రోడ్డు మార్గాలు ఉండటం పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి