* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

18, జనవరి 2011, మంగళవారం

హెయిర్ స్టైల్ డే : 30 ఏప్రిల్

మీ హెయిర్ స్టైల్...మీ పర్సనాలిటీని పెంచుతుంది!!
చాలామంది మహిళలు డ్రెస్సింగ్ స్టైల్‌పై చూపే శ్రద్ధ తమ హెయిర్ స్టైల్‌పై చూపరు. దీంతో మీరు ఎంత విలువైన దుస్తులు ధరించినా ఎక్కడో లోటు కనపడుతుంటుంది. అదే హెయిర్ స్టైల్ పై ప్రత్యేక దృష్టి సారిస్తే మరింత అందంగా ఉంటారు. మీ హెయిర్‌ స్టైల్‌తో మీ పర్సనాలిటీ పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు.ఎవరింటికైనా, ఏదైనా ఫంక్షన్ లేదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ డ్రస్సింగ్ స్టైల్‌పై చూపే శ్రద్ధతోపాటు హెయిర్ స్టైల్‌పై కూడా కాస్త ప్రత్యేక శ్రద్ధ కనపరచండి. దీంతో మీరు మరింత అందంగా కనపడతారని బ్యూటీ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు. విలువైన, అందమైన దుస్తులు ధరించినా మీ హెయిర్ స్టైల్ సరిగా లేకపోతే వాటికి విలువ పోతుంది. దీంతోపాటు మీ అందం కాస్త తగ్గుతుంది. మీ హెయిర్ స్టైల్ మీ వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుందనడంలో సందేహం లేదంటున్నారు బ్యుటీషియన్లు.బాలికలు, మహిళల హెయిర్ స్టైల్‌లో భూమ్యాకాశాల అంతరాలుంటాయి. హెయిర్ స్టైల్ వయసుకు తగ్గట్టు, మీరు ధరించే దుస్తులకు తగ్గట్టు ఉండాలి. దీనికిగాను మహిళల హెయిర్ స్టైల్, వారి వ్యక్తిత్వాలకున్న సంబంధాలను తెలిపేందుకు యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు పరిశోధకులు ఓ సర్వే నిర్వహించారు. తల వెంట్రుకలు పొట్టిగా ఉన్న మహిళల్లో ఆత్మ విశ్వాసం మెండుగా ఉంటుందని, అదే పొడవైన వెంట్రుకలున్న మహిళలు స్మార్ట్‌గా ఉండేందుకు ఇష్టపడతారని తమ పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు తెలిపారు.హెయిర్ స్టైల్ అనేది వాతావరణాన్నిబట్టి మార్చాల్సివుంటుంది. ఎందుకంటే వేసవి కాలంలో మీరు వెంట్రుకలను ముడి వేయకుండా గాలికి వదిలేస్తే మీరు మీ వ్యక్తిత్వంలో నిలకడ లేనివారిగా నలుగురిలో తక్కువగా చూడబడుతారు. ప్రస్తుతం మళ్ళీ పొడవాటి వెంట్రుకల ఫ్యాషన్ వచ్చేసింది. మీ ముఖం గుండ్రటి ముఖమైతే పొడవాటి వెంట్రుకలపై దృష్టి సారించండి. వీటిని ముడి వేయకండి. అదే విధంగా కోలముఖం కలిగినవారైతే మీ పొడవైన వెంట్రుకలను సగానికి ముడి వేసి మిగిలిన భాగాన్ని వదిలివేయండి. దీంతో మీ వ్యక్తిత్వం, అందం మరింత ద్విగుణీకృతమౌతుందంటున్నారు పరిశోధకులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి