పిల్లల కోసం లేదా పెద్దల కోసం ప్రత్యేకంగా రూపొందించుకున్న రీడింగ్ రూం అందంగా, సౌకర్యవంతంగా ఉండాలంటే.. ఎక్కడి వస్తువులను అక్కడ శుభ్రంగా సర్దుకోవాలి. రీడింగ్ రూంలో ప్రస్తుతం కంప్యూటర్లు ఉంచుకోవటం సహజం. అయితే కంప్యూటర్ బల్లను సర్దటంలో అశ్రద్ధ చేయకుండా, దానిని కూడా నీట్‌గా సర్దుకుంటే రీడింగ్ రూం అందంగా ఉంటుంది. కంప్యూటర్ బల్లపై పెన్నులు, పుస్తకాలు, సీడీలు, చిన్న చిన్న కాగితాల్లాంటివి పడవేయకుండా, వాటికి కేటాయించిన చోట సర్దుకుంటే అందంగా ఉండటమేగాకుండా, ప్రత్యేకంగా కూడా కనిపిస్తుంది. అలాగే కంప్యూటర్ బల్లకు సమీపంలో ఓ డిస్‌ప్లే బోర్డును తగిలించి అన్ని ముఖ్యమైన అంశాలను దానిపై రాసుకున్నట్లయితే డైరీలు, పేపర్ల అవసరం ఉండదు. దాంతో రీడింగ్ రూంలో అనవసరంగా పేపర్లు చేరవు.ఉత్తరాలు, పంపించాల్సిన కొరియర్లు, పెన్ను, పెన్సిల్ లాంటి వన్నీ పట్టేలా కంప్యూటర్ బల్ల సమీపంలోనో లేదా పక్కనో ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. అలాగే, చిన్న కప్పులో పదునైన కత్తెర, పేపర్లు కోసేందుకు చిన్న కత్తి, టేపు, స్టేప్లర్ వేసి బల్లపై ఓ మూల ఉంచుకోవడం మంచి పద్ధతి. అలాగే కంప్యూటర్ బల్లకు ఉండే సొరుగుల్లో సీడీలు, ముఖ్యమైన కాగితాలు, పుస్తకాలు లాంటి వాటిని అమర్చాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి