న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఉప ప్రధానిగా నియమితులయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ బుధవారం ఉదయం తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశాలున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు సమాచారం. ఈ సమయంలో ప్రణబ్ ముఖర్జీని ఉప ప్రధానిగా నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెంక్ సింగ్ అహ్లూవాలియాను గానీ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి. రంగరాజన్‌ను గానీ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా నియమించుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.కాగా, ఆంధ్రప్రదేశ్ నుంచి కిశోర్ చంద్రదేవ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నట్లు సమాచారం. తెలంగాణకు చెందిన ఒకరిద్దరకి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణవాదాన్ని పక్కన పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణకు చెందిన ఒకరిద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. కాగా, వీరప్ప మొయిలీ శాఖను మార్చే అవకాశాలున్నట్లు కూడా సమాచారం. ఆయన నిర్వహిస్తున్న న్యాయశాఖను పవన్ కుమార్ బన్సల్‍కు అప్పగించవచ్చునని అంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి