కలెక్టర్ శ్యామలరావు
విశాఖపట్నం(విశాల విశాఖ): బోగసు రేషను కార్డుల ఏరివేత సమయంలో కొత్తగా కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న 30 వేల మందికి అర్హత కూపన్లను జారీ చేయనున్నట్లు కలెక్టర్ జె.శ్యామలరావు వెల్లడించారు. వీరితో పాటు పలు దఫాలుగా కలెక్టరేట్‌కు వచ్చి కార్డుల కోసం దరఖాస్తు చేసిన వారికీ కూపన్లు ఇస్తామన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాల వారీ జాబితాలను సిద్ధం చేస్తున్నామన్నారు. రచ్చబండ కార్యక్రమంలో కూపన్లు పంపిణీ చేస్తామన్నారు. బోగసు కార్డుల ఏరివేత సందర్భంలో 30 వేల వరకు దరఖాస్తులు వచ్చాయని, వీటిన్నింటిని పరిశీలించడం పూర్తయ్యిందన్నారు. గతంలో వచ్చిన దరఖాస్తులపై విచారణ చేశామని, ఇందులో 7,051 మంది అనర్హులుగా, 329 మంది డూప్లికేట్‌గా, 1584 మంది చిరునామాలు కనిపించలేదని విచారణలో తేలిందన్నారు. వీరికి మాత్రం కూపన్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి