18, జనవరి 2011, మంగళవారం
నేటి నుంచి ఉద్యోగుల పెన్‌డౌన్
హైదరాబాద్: సమస్యల పరిష్కారానికై నేటి నుంచి మూడు రోజులపాటు ప్రభుత్వ ఉద్యోగులు పెన్‌డౌన్‌కు దిగనున్నారు. హెల్త్ కార్డు సౌకర్యం సహా 11 డిమాండ్లపై గత కొంతకాలంగా ఉద్యోగ సంఘాలు పలు దఫాలుగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె బత్యాల పెంపు, వోషనల్ ఇంక్రిమెంట్స్, కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగభద్రత తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. పదిలక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇవాల్టి ఆందోళనలో పాల్గొననున్నారు. అసంఘటిత కార్మికులు కూడా తమకు మద్దతిస్తూ... నిరసనలో పాల్గొంటారని ఉద్యోగ సంఘాల ఐకాస తెలిపింది. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో పాలన పూర్తిగా నిలిచిపోనుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి