విశాఖపట్నం(విశాల విశాఖ):మహావిశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని కమిషనర్ వి.ఎన్.విష్ణు పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహానికి కమిషనర్ విష్ణు, మేయర్ పులుసు జనార్దనరావు, ఉపమేయర్ దొరబాబు పూలమాల నివాళులు అర్పించారు. జాతీయపతకాన్ని ఆవిష్కరించి పావురాలను ఎగురవేశారు. జీవీఎంసీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ విష్ణు మాట్లాడుతూ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద రూ.1886 కోట్లతో 20 ప్రాజెక్టుల పనులు ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషన్ కృష్ణమూర్తి, ప్రధాన ఇంజినీరు జయరామిరెడ్డి, కార్పొరేటర్లు, అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి