* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

21, జనవరి 2011, శుక్రవారం

బ్లాక్‌మెయిల్‌ చేసేందుకే ఓదార్పు

మాజీ మంత్రి, తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి
విశాఖపట్నం(విశాల విశాఖ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బ్లాక్‌ మెయిల్‌ చేసేందుకే మాజీ ఎంపీ జగన్‌ ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి ధ్వజమెత్తారు. వీజేఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో నగర తెదేపా అధ్యక్షుడు పీలా శ్రీనివాస్‌తో కలిసి శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు లెక్కలేనని కుంభకోణాలు జరిగాయన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం లూటీ అయ్యిందని పేర్కొన్నారు. జగన్‌ ఎంపీగా ఉన్నపుడు అయిదుసార్లు పెట్రోలు ధరలు పెరిగాయని అప్పుడు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఇప్పుడు ధరలు పెరగగానే జనదీక్ష అంటూ నిరసన చేయడం ఏంటని ప్రశ్నించారు. అవగాహన లేకుండా ఆయన ఏవేవో మాట్లాడుతున్నారని, తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన కిలో రూ.2 బియ్యం పథకాన్ని వై.ఎస్‌.దిగా చెప్పుకోవడాన్ని తప్పుపట్టారు. తెదేపాను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌, జగన్‌ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సంపాదించిన అవినీతి సొమ్మును కాపాడుకునేందుకే దీక్షలంటూ జగన్‌ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. వైఎస్‌ హయాంలో 12 సార్లు పెట్రోల్‌ ధరలు పెరిగినా ఈయనకు ఏమీ కనిపించలేదని ఎద్దేవా చేశారు. తీరంలో జగన్‌ దీక్ష చేస్తే సముద్రం మొత్తం అవినీతితో కలుషిత మైపోతుందన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి