పాడేరు: ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీమోదకొండమ్మ పుట్టిన రోజు వేడుకలు ఆదివారం పాడేరులో ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. మన్యంలోని మండలాల నుంచే కాకుండా మైదాన ప్రాంతం నుంచి కూడా అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం జరిగిన ఉత్సవ విగ్రహం ఊరేగింపులో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయ ధింసా, గుమ్మాలాట, పలు సాంస్కృతిక నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా బాణసంచా కాల్చారు. ఈ తీర్థ మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కె.చిట్టినాయుడు, కార్యదర్శి పీవీజీ కుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి