విశాఖ : పెట్రో ధరల పెంపుకు నిరసనగా యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 22వ తేదీన విశాఖలో ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాకు ఆయన అన్ని వర్గాల మద్దతు కోరారు. విశాఖ జిల్లాలో జగన్ రెండోవిడత ఓదార్పు యాత్రను పాయకరావుపేట నుంచి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే వాటిని నియంత్రించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నాయని ప్రశ్నించారు.దీనివల్ల సామాన్య ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురి అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధరలను నియంత్రించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని జగన్ అన్నారు. కాగా 21వ తేదీతో విశాఖ జిల్లాలో ఓదార్పు యాత్ర ముగియనుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి