18, జనవరి 2011, మంగళవారం
దూరవిద్య ద్వారా పీహెచ్‌డీ ప్రవేశాల నిలిపివేత
హైదరాబాద్: విశ్వవిద్యాలయాలు దూరవిద్య ద్వారా పీహెచ్‌డీ ప్రవేశాలను నిర్వహించటం నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈరోజు సచివాలయంలో ఉన్నతవిద్యా శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పై నిర్ణయం తీసుకున్నారు. ఓయులో విద్యార్థులకు ఇప్పటికే పరీక్షలు రాసేందుకు చాలా సమయం ఇచ్చినందున యధావిధిగా పరీక్షలన్నీ నిర్వహించాలని నిర్ణయించారు. ఏయులో వందకుపైగా బోధనాపోస్టుల భర్తీకి అంగీకరించారు. విశ్వవిద్యాలయాలకు ఇచ్చే నిధులను 30 శాతం పెంచాలని వీసీలు కోరారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి