16, జనవరి 2011, ఆదివారం
వీడియోకాన్ టవర్లో అగ్నిప్రమాదం
ఢిల్లీ : నిత్యం వినియోగదారులతో కిటకిటలాడే జండేవాలన్ ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనం వీడియోకాన్ టవర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలోని మూడో అంతస్తులో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై అగ్నిమాపకదళ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... మధ్యాహ్నం ఒంటి గంట సయమంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అందించిన సమాచారం ఇచ్చిన పది నిమిషాలకే పెద్ద సంఖ్యలో అగ్నిమాపక వాహనాలు వీడియోకాన్ టవర్ వద్దకు చేరుకొని, మంటల్ని అదుపులోనికి తెచ్చాయి. ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ ఏ ఒక్కరూ గాయపడకుండా బయటపడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో సంఘటన చోటు చేసుకున్నా ఎవరికీ గాయాలు కాకపోవడంతో జండేవాలన్ నివాసులు వూపిరి పీల్చుకున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి