హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రవితేజ హీరోగా కొత్త చిత్రం నిర్మించనున్నారు. ఈ చిత్రానికి 'దొంగల ముఠా' అనే పేరు ఖరారు చేశారు. అయిదు రోజుల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేయాలనుకోవడం విశేషం. నటులకు, సాంకేతిక నిపుణులకు ప్రతిఫలం ఇవ్వకపోవడం మరో విశేషం. అంటే ఈ చిత్రం కోసం పనిచేసేవారికి ఎవరికీ డబ్బు ఇవ్వరు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 11న ప్రారంభమవుతుంది. మార్చి 11న సినిమా విడుదలవుతుంది. ఈ చిత్రంలో రవితేజతోపాటు ఛార్మీ, అజయ్, సుబ్బరాజు ప్రధాన పాత్రలు పోషిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి