పశ్చిమగోదావరి: మండలంలోని బాదంపూడి గ్రామంలో భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడో భర్త. భార్య ప్రస్తుతం చావుబతుకుల మధ్య చికిత్స పొందుతోంది. భర్యాభర్తలు సత్యన్నారాయణ(55), మహలక్ష్మి(50) స్థానికంగా ఓ కోళ్ల ఫారంలో పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య స్పర్ధలున్నాయి. ఈ నేపధ్యంలో ఉదయం ఘర్షణ జరిగింది. సత్యన్నారాయణ కత్తితో మహలక్ష్మిపై దాడి చేసి, ఆమె భుజంపై గాయపరిచాడు. ఆ తరువాత భయంతో పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన మహలక్ష్మి కేకలు విని స్థానికులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. పారిపోయిన సత్యన్నారాయణ కోసం వెతికారు. ఆచూకీ లభించక పోవడంతో ఎక్కడికో పారిపోయి ఉంటాడని భావించారు.అయితే పారిపోయిన సత్యన్నారాయణ సమీప పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగి మృతి చెందాడు. మధ్యాహ్నన్నానికి తుప్పల్లో శవాన్ని గ్రామస్థులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి