16, జనవరి 2011, ఆదివారం
ఎంజీఆర్ పాలన తెస్తాం
చెన్నై: రాష్ట్రంలో ఎంజీఆర్ పాలనను తిరిగి తెస్తామని అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్నిధ్వంసం చేస్తున్న పార్టీలపై నిఘా వేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. తమిళుల సంరక్షణకు, దుష్టశక్తులను పారదోలడానికి ఎంజీఆర్ చేసిన కృషిని గుర్తు చేశారు. రాజకీయంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ మనసులో ఎంజీఆర్‌ని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూనే ఉంటారని అన్నారు. ఎంజీఆర్ ప్రవేశపెట్టిన పథకాల ప్రధానోద్దేశం ప్రజలను పైకి తీసుకురావటమేనని పేర్కొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి