ఎం.వి.పి కాలనీ, (విశాల విశాఖ): ఎంవీపీ కాలనీలోని సంపత్ వినాయక యూత్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఎఎస్ రాజా కళాశాల గ్రౌండ్స్‌లో 112 అడుగుల భారీ వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి వచ్చిన సుమారు 50 మంది కార్మికులు ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇంత భారీ విగ్రహానికి భారీ లడ్డూ నైవేథ్యం ఉండాలనే ఉద్దేశ్యంతో 6,399 కేజీల లడ్డూను తయారు చేయించారు. సువర్ణభూమి రియల్ ఎస్టేట్ సంస్థ ఇందుకుగానూ రూ.10.50 లక్షలు ఖర్చు చేసింది. ఈ లడ్డూను తాపేశ్వరంలోని భక్తాంజనేయ సీట్స్ సంస్థ తయారు చేసింది. 15 మంది గణేష్ మాలలు ధరించి, లడ్డూను ప్రతిష్టాత్మకంగా తయారు చేశారు.ఈ లడ్డూ తయారీకి 2000కేజీల శనగపండి, చక్కెర 2,100 కేజీలు, నెయ్యి 900 కేజీలు, డ్రైపూట్స్ 600 కేజీలు , పటికబెల్లం 450 కేజీలు ఉపయోగించినట్టు తయారీ దారు సలాది వెంకటేశ్వరరావు (శ్రీనుబాబు) తెలిపారు. తయారీకి 24 గంటల సమయం పట్టిందని, 21 రోజులపాటు పాడవకుండా ఉంటుందని తెలిపారు. ఇంత పెద్ద పరిమాణంలో లడ్డూను ఇంతకముందు ఎవరూ తయారు చేయలేదని, ఆ ఘనత తమ సంస్థకే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో శ్రీ సంపత్ వినాయక విశాఖ యూత్ అసోసియేషన్ ఛైర్మన్ తుమ్ములూరి జగదీశ్వరరెడ్డి, సువర్ణ భూమి సంస్థ జీఎం మేఘం సతీష్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి