న్యూఢిల్లీ: మీడియా గోరంతలు కొండంతలు చేసి చెప్పడాన్ని నిరోధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఓ కమిటీని వేయాలని యోచిస్తోంది. మీడియా కారణంగానే అన్నాహజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం బలోపేతం అయిందని కొన్ని వర్గాలు చేస్తున్న వాదన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తోంది. ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా... మీడియా అతిగా స్పందిస్తున్న తీరును కట్టడి చేయాలనుకుంటోంది. మీడియాలో వచ్చే అలాంటి అంశాలను పరిశీలించేందుకు, ప్రభుత్వానికి తగిన సూచనలు చేసేందుకు కమిటీని నియమించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం జరిగిన కేంద్రకేబినెట్ సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. వార్తల్లో 'అతి'ని నియంత్రించాల్సిన అవసరం ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కమల్‌నాథ్ కేబినెట్ సమావేశంలో అభిప్రాయపడినట్టు కూడా ఆ వర్గాలు తెలిపాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి