* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

25, సెప్టెంబర్ 2011, ఆదివారం

విలీనంతో మరింత బలోపేతం

                            ఉత్తరాంధ్ర కాంగ్రెస్‌ గర్జన  సభలో కాంగ్రెస్‌ నేతల స్పష్టీకరణ
విశాఖపట్నం(విశాల విశాఖ): కాంగ్రెస్‌ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ (ప్రరాపా) విలీనం కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ మరింతగా బలపడిందని కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు. దీనికి నిదర్శనం విశాఖలో జరిగిన బహిరంగ సభ విజయవంతం కావడమేనని పేర్కొన్నారు. రాబోయే కాలంలో గ్రామ స్థాయిలో ఇరుపార్టీ శ్రేణులు మరింతగా కలిసిమెలిసి కార్యక్రమాలను చేపట్టడం ద్వారా 2014లో జరిగే సాధారణ ఎన్నికల్లో అన్ని స్థానాలు కైవసం చేసుకొనే స్థాయికి వెళ్లాలని నేతలు పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర కాంగ్రెస్‌ గర్జన పేరిట నగరంలోని రామకృష్ణబీచ్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. విలీనానికి దారితీసిన పరిస్థితులను వివరిస్తూనే రాబోయే కాలంలో చేపట్టబోయే కార్యక్రమాలు, కిరణ్‌కుమార్‌ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను వల్లెవేశారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి బహిరంగ సభను విజయవంతం చేయడం పట్ల హర్షం వెలిబుచ్చారు. పీసీసీ నేత బొత్స, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేత చిరంజీవి ముగ్గురు త్రిమూర్తులు లాంటి వారని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీని ముందుకు తీసుకెళ్ల గలిగే దిట్టలుగా వర్ణించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ రెండు పార్టీల మేలు కలియికని అట్టడుగు స్థాయి వరకు తీసుకెళ్లి కాంగ్రెస్‌ పార్టీని మరింతగా బలోపేతం చేయాలని కోరారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఐకమత్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలన్నారు. సోనియాగాంధీ త్యాగశీలి అని, ఆమె నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తోందన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌తో సాధ్యమని, ఈ పార్టీలో ప్రరాపాను విలీనం చేయడం హర్షణీయమన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కిరణ్‌కుమార్‌ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున అమలు జరుతున్నాయన్నారు.రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎంతో బలమైనదని, దాన్ని ఎవరూ ఎదిరించలేరన్నారు. కొన్ని పార్టీలు ఏవేవో చెబుతున్నాయని, తమకున్న పార్టీ, పత్రికలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నారని, వారి ఆటలు సాగబోవన్నారు. పార్టీ సంస్థాగతంగా పటిష్ఠంగా ఉందని, పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. రాజ్యసభ సభ్యులు టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం వంటి ఎన్నో సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. చిరంజీవితో తనకు 35 ఏళ్ల గా అనుబంధం ఉందని, ఆయన కాంగ్రెస్‌లో చేరడం వల్ల పార్టీ మరింతగా బలోపేతం అవుతుందన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స, చిరంజీవి కలియకలో కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధిస్తుందన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి నాయకత్వంలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు జరుగుతున్నాయని, రైతులు, మహిళలు, యువత ఇలా అన్ని వర్గాలకు పథకాల ఫలితాలు అందుతున్నాయన్నారు. అనకాపల్లి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనం కావడంతో పార్టీ మరింతగా బలపడిందన్నారు. భవిష్యత్తులో ఇదే ఊపు కొనసాగిస్తూ మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. మాజీ మంత్రి షబ్బీర్‌ ఆలీ మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న జగన్‌కు ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం వల్లే వైఎస్‌కు పదవులు వచ్చాయని, అటువంటి కాంగ్రెస్‌ అధినేత్రిని లక్ష్యం చేసుకొని జగన్‌ విమర్శలు చేయడం విచారకరమన్నారు. ఎంపీలు కిల్లి కృపారాణి, బొత్సఝాన్సీ, అటవీ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, విజయనగరం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి, ప్రభుత్వ విప్‌ కోండ్రు మురళీ మోహన్‌, నగర కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు తైనాల విజయకుమార్‌, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు ద్రోణంరాజు శ్రీనివాస్‌, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు తోట నగేష్‌ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వట్టి వసంతకుమార్‌, పినిపే విశ్వరూప్‌, పార్ధసారధి, తోట నర్సింహం, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, చింతలపూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, వంగా గీత, మళ్ల విజయప్రసాద్‌, బోళెం ముత్యాలపాప, ప్రరాపా నాయకులు అల్లు అరవింద్‌, నాగబాబు, సి.రామచంద్రయ్య, డాక్టర్‌ ఎస్‌.ఎ.రెహ్మాన్‌, కె.వి.సిహెచ్‌. మోహనరావు, కోటగిరి విద్యాధరరావు, ఎమ్మెల్సీ సాగి సూర్యనారాయణరాజు, మేయరు పులుసు జనార్ధనరావు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బలిరెడ్డి సత్యారావు, గురుమూర్తిరెడ్డి, కె.చిట్టినాయుడు, మరియాదాస్‌, యల్లపు రఘురాం, సోడదాసు సుధాకర్‌, సతీష్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి