సావోపాలో: అంగోలా అందగత్తె లైలా లోప్స్ ఈ ఏడాది విశ్వసుందరిగా ఎంపికైంది. ఉక్రెయిన్, బ్రెజిల్, ఫిలిప్పీన్స్, చైనా సుందరీమణులను వెనక్కి నెట్టి లోప్స్ విశ్వసుందరిగా అవతరించింది. రెండు, మూడు స్థానాలను ఉక్రెయిన్, బ్రెజిల్ భామలు దక్కించుకున్నారు. భారత్ నుంచి కోటి ఆశలతో వెళ్లిన వాసుకి సుంకవల్లి నిరాశపరిచారు. ఆమెకు తుది 16 మందిలోనూ చోటు దక్కకపోవడం గమనార్హం. బ్రెజిల్‌లోనిసావోపాలోలో జరిగిన 2011 విశ్వసుందరి పోటీల్లో .. సోమవారం ధగధగ మెరిసిపోతున్న గౌను ధరించిన 25 ఏళ్ల లోప్స్‌కు గతేడాది విశ్వసుందరి జిమెనా నవరెటె విశ్వసుందరి కిరీటాన్ని అలంకరించారు. పోటీల్లో మొత్తం 98 మంది అందగత్తెలు పాల్గొన్నారు. ఉక్రెయిన్‌కు చెందిన ఒలెసియా స్టెఫాంకో, మూడో స్థానంలో బ్రెజిల్‌కు చెందిన ప్రిస్కిలా మచడోలు రెండు మూడు స్థానాల్లో నిలిచారు. సావోపాలోలోని క్రెడికార్డ్ హాలులో ఆహూతులంతా నిలబడి కరతాళధ్వనులు చేస్తుండగా విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకొన్న లోప్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆనందభాష్పాలను అతికష్టం మీద ఆపుకొంటూ.. ''ఇప్పుడు నాకు పని దొరికింది. ఇకపై మరింత వినయంగా ఉండేందుకు ప్రయత్నిస్తా'' అని లోప్స్ విలేకర్లతో చెప్పారు. అంతకుముందు న్యాయనిర్ణేతలు ఆమెను మీకు అవకాశం వస్తే శరీరాకృతిని మార్చుకుంటారా అని అడగ్గా.. ''ఏమీ మార్చుకోను. దేవుడు ఇచ్చినదానితో సంతృప్తిగా ఉన్నా'' అని బదులిచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి