ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖ రరెడ్డి మాదిరిగా తాను అనుకున్నదే చేస్తున్నారు. 108 సర్వీసు నిర్వహణ కోసం చిరంజీవి ఎన్ని ప్రయత్నాలు చేసినా, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారా యణ వంటి నేతలు ఎన్ని సిఫారసులు చేసినా కిరణ్‌కుమార్‌రెడ్డి తాను అనుకు న్న నిర్ణయాన్నే అమలు చేశారు. 108 సర్వీసు నిర్వహణ చేపట్టేందుకు చిరం జీవి తనంతట తాను ముందుకు వచ్చినా.. కిరణ్‌కుమార్‌రెడ్డి మాత్రం తాను కేటాయించదలచుకున్న జీవీకే కంపెనీ వైపే మొగ్గు చూపి, చిరంజీవి బొత్సకు చెక్ పెట్టారు. చాలాకాలం పాటు సందిగ్థంలో ఉన్న 108 సర్వీసు నిర్వహణ ఎవరికి కేటాయించాలన్న అంశం ఆసక్తికరంగా మారింది.ఈ వ్యవహారంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి వట్టి వసంతకుమార్ రంగం లోకి దిగి చిరంజీవి పక్షాన లాబీయింగ్ చేసినా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. చివరకు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి, కేంద్ర వైద్యశాఖమంత్రి గులాంనబీ ఆజాద్‌తో సిఫార్సు చేయించారు. ముఖ్యమంత్రి తాను అనుకున్న కంపెనీకే 108 నిర్వహణ కట్టబెట్టడం ద్వారా.. పార్టీ-ప్రభుత్వంలో త న పట్టు చాటుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి 108 నిర్వహణను తిరిగి జీవీకేకు కేటాయించడాన్ని అడ్డుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈవిషయంలో కిరణ్ దాదాపు వైఎస్ మాదిరిగానే వ్యవహరించినట్లు కనిపిస్తోంది.108 సర్వీసు నిర్వహణను జీవీకే సంస్థకు ఇచ్చేందుకు ఒప్పందం ఖరారయిన నేపథ్యంలో ప్రభుత్వంపై తనకున్న పట్టును కిరణ్ ప్రదర్శించారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఇటీవలే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, అధిష్ఠానానికి దగ్గరయిన చిరంజీవి పక్షాన చివరి వరకూ పోరాడారు. ఆయనతో పాటు మరికొందరు కాపు నేతలూ చిరు పక్షాన రంగంలోకి దిగారు. అయితే, చిరంజీవికి ఈ సర్వీసు నిర్వహణ కట్టబెడితే, అది పార్టీ-ప్రభుత్వంలో చిరు హవా పెరిగిందన్న సంకేతాలు వెళతాయన్న మందుజాగ్రత్తతోనే కిరణ్ ఆయనకు చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది.అదీకాకుండా.. ఇటీవలి కాలంలో బొత్సతో సన్నిహితంగా ఉంటున్న చిరంజీవికి ఈ వ్యవహారం ఓ కనువిప్పు కావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. బొత్సతో ఉంటే నష్టమే తప్ప లాభం లేదన్న భావన కలిగించడంతో పాటు, తనతో ఉంటే ఎంత లాభం ఉంటుందన్న విషయాన్ని కిరణ్ పరోక్షంగా చిరుకు చెప్పకనే చెప్పినట్టయిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి