అనకాపల్లి(విశాల విశాఖ):విద్యార్థులు వాహనాలను నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించి నడపాలని ట్రైనీ డిఎస్పీ రమాదేవి తెలిపారు. పట్టణంలోని డైట్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం హీరో కంపెనీవారు నిర్వహించిన సేఫ్ డ్రైవ్ రిహాసల్స్ సెమినార్‌లో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థు లకు కాలేజీ దశ చాలా విలువైనదని జీవితానికి ఈ దశ పునాధి అని దానిని సక్రమంగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు.ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ తరువాత సాఫ్టవేర్ కంపెనీలవైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని అలా కాకుండా గ్రూప్స్ వైపు కూడా దృష్టి సారించాలని ఆమె తెలిపారు. అలా చేయడం వలన ప్రజలకు సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు. ర్యాష్‌గా డ్రైవింగ్ చేయడం వలన ప్రమాదాల బారిన పడి తీవ్ర ఇబ్బందులకు గురి కావలసి వస్తుందని, మీపై ఎంతో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తుందని ఆమె అన్నారు.అదేవిధంగా ప్రమాదం జరిగినప్పుడు మీతో పాటుగా ప్రమా దానికి గురైన ఎదుటి వ్యక్తి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ పాపారావు, ఇంజనీరింగ్ కళా శాల కరస్పాండెంట్ దాడి రత్నాకర్, ప్రిన్సిపల్ రామ్మోహన్‌రావు, హీరో ట్రైనర్ ఎం.గోపీ నాయుడు, మెకానిక్ సెక్షన్ సూపర్‌వైజర్ వినోద్, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి