బెంగళూరు: పలు వైపుల నుంచి ఒత్తిడి రావడంతో కర్ణాటక లోకాయుక్త శివరాజ్ పాటిల్ సోమవారం రాజీనామా చేశారు. బెంగళూర్‌లో ఆయన కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా నివేశన స్థలాన్ని పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన మనస్తాపానికి గురై రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, మాజీ మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు వంటి ప్రముఖుల కేసులపై శివరాజ్ పాటిల్ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.తనకు వ్యతిరేకంగా జరుగుతున్న విషప్రచారం తనను ఎంతో బాధించిందని, ఇటువంటి వాతావరణంలో రాజీనామా చేయడమే మంచిదని తాను అనుకున్నానని, కొంత మంది విషప్రచారానికి బాధపడే తాను రాజీనామా చేశానని ఆయన గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్‌కు రాజీనామా లేఖను సమర్పించిన తర్వాత అన్నారు. రాజీనామా సమర్పించడానికి ముందు లోకాయుక్త శివరాజ్ పాటిల్ భరద్వాజ్‌ను కలిసి గంటకుపైగా మాట్లాడారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి