గాజువాక, : రాష్ట్రంలో అతిపెద్ద గణనాథుని విగ్రహాన్ని గాజువాకలో ఏర్పాటు చేయడం ద్వారా పట్టణ ఖ్యాతి మరింత ఇనుమడించిందని గాజువాక ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య అన్నారు. బుధవారం గాజువాక లంకావారి మైదానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ గణనాథుడిని అనేక వ్యవప్రయాసలకోర్చి నిర్మించిన స్థానిక సంపత్‌వినాయక అసోసియేషన్ సభ్యులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు.117అడుగుల ఎత్తు, 55అడుగుల వెడల్పు కలిగిన భారీ గణనాథుని విగ్రహాన్ని మేయర్ గురువారం ఉదయం 11.26నిమషాలకు లంకావారి మైదానంలో ప్రతిష్టించనున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. పారిశ్రామిక ప్రాంతంలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు భారీ వినాయకుని విగ్రహం దోహదపడుందన్నారు. అనంతరం కర్నంరెడ్డి నర్సింగరావు మాట్లాడుతూ 90రోజులుపాటు 200మంది కార్మికులు అహర్నిశలు శ్రమించి 117అడుగుల విగ్రహాన్ని నిర్మించారన్నారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఇల్లపు రాము, కర్నం కనకారావు, సంపత్ వినాయకా అసోసియేషన్ సభ్యులు శివ, ముఖేష్, కనకారావు తదితరులు పాల్గొన్నారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి