విశాఖపట్నం: విశాఖ నుంచి సికింద్రాబాద్ మీదుగా నిజాముద్దీన్‌కు రాజధాని ఎక్స్‌ప్రెస్ నడిపే విషయంలో దక్షిణమధ్య రైల్వే ముందుకొచ్చినా తూర్పుకోస్తా రైల్వే తగిన సహకారాన్ని అందించకపోవడంపై ప్రజారాజ్యం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, అనకాపల్లి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు ఆక్షేపణ తెలిపారు. ఈ రైలు ఖచ్చితంగా విశాఖకు రావాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై తమ పార్టీ తరఫున వాల్తేరు డివిజినల్ రైల్వే అధికారులను మంగళవారం కలిసి చర్చిస్తామని ఆయన తెలిపారు. . విశాఖ నుంచి తీవ్రంగా ఉన్న రైళ్ల కొరతను తీర్చేందుకు పొరుగు జోన్ స్పందించినా తూ.కో.రై. మాత్రం ముందుకు రాకపోవడం సబబు కాదన్నారు. విశాఖ కంటే చిన్నదైన కాకినాడ స్టేషన్ నుంచి కొన్నాళ్ల పాటు రాజధాని ఎక్స్‌ప్రెస్ నడిచిందనీ, విశాఖలో రూ.కోట్ల ఖర్చుతో రైళ్ల నిర్వహణ సముదాయాన్ని సయితం నిర్మించాక సాకులు చెప్పడం తగదని ఆయన అన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి