16, డిసెంబర్ 2010, గురువారం
కొణతాల వెంటే అంతా
మునగపాక(విశాల విశాఖ): కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఓదార్పుయాత్ర విషయంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆర్‌ఈసీఎస్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ అన్నారు. గురువారం రాత్రి స్థానిక కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ప్రసాద్ మాట్లాడుతూ మునగపాక గ్రామాభివృద్ధికి కొణతాల రామకృష్ణ రూ. కోట్లు మంజూరుచేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి మరువరానిదన్నారు.ఆయన ఆశయ సాధనకు జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రకు జిల్లాకు రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మంచైనా, చెడైనా కొణతాల వెంటే ఉంటామంటూ మునగపాక కాంగ్రెస్ కార్యకర్తలు ఈ సందర్భంగా తీర్మానించారు. శుక్రవారం ఉదయం పది గంటలకు అనకాపల్లి సుబ్రహ్మణ్యం కల్యాణమండపంలో జరగనున్న సమీక్ష సమావేశానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జై జగన్....జై కొణతాల అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు మళ్ల సంజీవరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడారి గణపతి అచ్చెయ్యనాయుడు, ఎంపీటీసీ సభ్యులు సూరిశెట్టి సుధారాణి, ఆళ్ల పైడితల్లి, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి