'మృగం' దర్శకుడు స్వామి తీసిన ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో 'నేటి చరిత్ర'గా డబ్బింగ్ చేశారు. ఈ చిత్రం ఈనెల 31న విడుదల కాబోతుంది. చెన్నైలో సెన్సార్ పూర్తయిన ఈ చిత్రం తెలుగులో ఇటీవలే కొంతమందికి చూపించారు. ఈ చిత్రంపై పలురకాలుగా తర్జనభర్జలు జరుగుతున్నాయి. సెక్స్‌ను విపరీతంగా చూపించేసి చివరికి అది తప్పు అని సందేశాన్నిస్తే చాలా...? అని ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశ్నిస్తున్నారుస్వామి గతంలో 'మృగం' తీశాడు. అందులో ఎద్దుల్ని పెంచే ఓ వ్యక్తి ఎద్దులాగా తన కంటికి నచ్చి ఆడదాన్ని లొంగదీసుకోవడం, కన్నతల్లి చెప్పినా వినిపించుకోకుండా ఆమెనుసైతం కొట్టడం జరుగుతుంది. చివరికి ఎయిడ్స్ వచ్చి చనిపోవడంతో కథ ముగుస్తుంది. ఇది అప్పట్లో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.కానీ ప్రస్తుతం కథ మాత్రం పూర్తి విరుద్ధం. వావివరసలు మరచిన ఓ మామ తన కోడలిని లొంగదీసుకుని ఏవిధంగా ఎంజాయ్ చేశాడన్నదే 'నేటి చరిత్ర'. మిలట్రీ నుంచి ఊరికి వచ్చిన ఆ వ్యక్తి భార్య చనిపోతుంది. కొడుకు పంచన చేరతాడు. అప్పటికే కొడుక్కి పెండ్లి జరుగుతుంది. తన భార్యతో సరదాగా గడిపే అతను చదువు నిమిత్తం వేరే ఊరు వెళ్ళాల్సి వుంటుంది. కానీ, భార్యను తన తండ్రి దగ్గరే వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో కోడలిని లొంగదీసుకుంటాడు. ఇలా కొన్నాళ్ళు జరిగాక విషయం తెలిసిన కొడుకు తండ్రిని చంపేస్తాడు. ఆ తర్వాత భార్యనూ చంపేస్తాడు. ఇదీ కథ.శనివారం రాత్రి ప్రివ్యూచూసిన కొంతమంది సినీప్రముఖులు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. మన సమాజంలో ఇటువంటి కాన్సెప్ట్‌తో చిత్రాలు రావడం.. చివర్లో ఏదో సందేశం ఉందనడం వంటివి యువతన పెడధోవన పట్టించే విధంగా ఉంటున్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు.మరికొందరు... గతంలో శ్రీకాంత్ నటించిన 'ఆమె' చిత్రంలో కొడుకు చనిపోతే కోడలు గతి ఏమిటనే సందర్భంలోనే ఇ.వి.వి. సత్యనారాయణ అటువంటి సినిమా తీశాడు. కాకపోతే కొద్దిగా మన నేటివిటీని మార్చి తీశాడు. కాబట్టి అది హిట్ అయింది. 'నేటిచరిత్ర' అనేది పరభాషా నేటివిటీ అని దీన్ని ఎలా రీసీవ్ చేసుకుంటారనేది చూడాల్సిందేనని అంటున్నారు.అసలు ఈ చిత్రం మాతృక మలయాళం. ఆ చిత్రాన్ని తమిళంలో తీశారు. కాని తమిళంలో మహిళాసంఘాలు దర్శకుడు స్వామికి ఈ చిత్రం విడుదల తర్వాత దేహశుద్ధి చేసినట్లు చెబుతున్నారు. మరి సాంప్రదాయాలు, కట్టుబాట్లు బాగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో నేటిచరిత్ర ఎటువంటి స్పందన చూపిస్తుందో
చూడాలి.
చూడాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి