14, డిసెంబర్ 2010, మంగళవారం
కేరట్ తో కాంతులీనే చర్మం
మేకప్ చెదరకుండా ఉండాలంటే.. ఒక టీస్పూన్ క్యారెట్ రసంలో అర టీస్పూన్ పన్నీరు, పావు టీస్పూన్ చందనంపొడి చేర్చి ముఖానికి బాగా అప్లై చేయాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆపై మేకప్ వేసుకుంటే గంటలతరబడీ మేకప్ చెదిరిపోకుండా ఉంటుంది. చర్మం నిగనిగలాడుతూ ఉండేందుకు క్యారెట్‌కు తొక్క తీయకుండా తురిమి ఎండబెట్టాలి. 50 గ్రాము క్యారెట్ ఎండు తురుముకు అంతే సమానంగా దోస విత్తనాలు, వంద గ్రాముల పెసరపప్పు, బార్లీలను పొడి చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తూ ఉంటే చర్మం మంచి రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. కాసిన్ని బాదంపప్పులను నీటిలో నానబెట్టాలి. ఒక క్యారెట్‌కు తొక్క తీయకుండా ముక్కలు చేసి, వాటికి బాదంపప్పును కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పూసి అరగంట తరువాత స్నానం చేయాలి. ఈ పదిహేను రోజులకు ఒకసారి చేస్తే చర్మం బిగుతుగా మారుతుంది.ఎండకు కమిలి, రంగు కోల్పోయిన చర్మానికి క్యారెట్ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. రంగును పెంచటమేగాకుండా చర్మ ఆరోగ్యానికి క్యారెట్ రసం తోడ్పడుతుంది. వేసవిలో జుట్టు చివర్లు పగిలిపోయినట్లయితే.. క్యారెట్ ఆకులకు కాస్తంత నువ్వుల నూనె కలిపి మెత్తగా నూరి తలకు పూసుకుని పెసరపిండిని తలకు మర్దిస్తూ స్నానం చేసినట్లయితే.. జుట్టు చివర్లు తెగకుండా, జుట్టు నిగనిగలాడుతూ ఉంటుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి