ఎండలో ఎక్కువగా తిరిగేవారికి, రంగుల లాంటి రసాయనాలను ఉపయోగించేవారికి, జుట్టును వంకీలుగా తిప్పించుకునేవారికి వాతావరణంలోని మార్పులు హాని కలుగజేస్తాయి. అయితే ఇలాంటివారి జట్టును, మాడును బాగు చేసేందుకు అరటి పండ్లు మంచి ఔషధంలా పనిచేస్తాయి. అరటిపండులోని పొటాషియం మాడుపై ఉండే ఎలాంటి బ్యాక్టీరియానైనా సరే తొలగించి, జుట్టు ఆరోగ్యవంతంగా పెరిగేలా తోడ్పడుతుంది.
ఒక పండిన అరటిపండును తీసుకుని మెత్తని ముద్దలా చేసి.. దానిని మాడుకు, జుట్టుకు పట్టించాలి. తరువాత తలకు క్యాప్ వేసుకుని ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఆపై షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యవంతంగా తయారవుతుంది.జీవరహితంగా కనిపించే జుట్టు కోసం.. ఒక అరటిపండులో ఒక టీస్పూన్ ఆల్మండ్ ఆయిల్ కలిపి, దానిని జుట్టుకు పట్టించాలి. తరువాత వేడినీటిలో ముంచి పిండిన టవల్‌ను తలకు చుట్టుకుని 20 నిమిషాలపాటు ఉంచుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో తలను కడిగి, షాంపూ చేసుకుంటే జుట్టు మెరిసిపోతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి