గుంటూరు, నరసరావుపేట: నేను సమైక్యవాదిగానే ఉన్నాను. ఆశావాదిగా అందరూ కలిసి ఉండేలా కమిటీ నివేదిక ఇస్తుందని భావిస్తున్నా. రెండ్రోజులాగితే మీరేచూస్తా'రుగా అంటూ శ్రీకృష్ణకమిటీ నివేదికపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లాలో ఆయన పరామర్శ యాత్ర నిర్వహించారు. రైతులను ఓదార్చారు. నరసరావుపేటలో మాట్లాడారు. ఆందోళనలలో పాల్గొన్న విద్యార్థులపై కేసులను ఎత్తి వేయటం అభినందనీయంగా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం నుంచి సహాయం తీసుకురావటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా అన్నదాతల తరపున ఎవరు ఉద్యమాలు చేపట్టినా మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ దుస్థితి నుంచి రైతాంగం బయటపడాలంటే జాతీయ వ్యవసాయ విధానం అమల్లోకి తీసుకురావాలన్నారు.కౌలు రైతులను కాపాడేందుకు నిబంధనలను సడలించాలన్నారు.20 కుటుంబాలకు సాయం: పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి గుంటూరు జిల్లాలో చేపట్టిన పరామర్శ యాత్ర రెండోరోజు 20 కుటుంబాలకు రూ.25 వేల వంతున చెక్‌లను అందించారు. చదువుకుంటున్న పిల్లలుంటే ఉన్నత చదువులకు ఖర్చు భరిస్తామన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి