క్లబ్ డ్యాన్సర్ సిల్క్ స్మిత జీవిత గాథ ఆధారంగా ది డర్టీ పిక్చర్ అనే చిత్రం నిర్మితం కానుంది. బాలీవుడ్ నటి విద్యా బాలన్ ఈ చిత్రంలో సిల్క్ స్మిత పాత్రను పోషించనుంది. ఇందుకోసం విద్యాబాలన్.. స్మిత బంధువులను, కుటుంబ సభ్యులను త్వరలో కలుసుకోనుంది.మిలన్ లుథ్రియా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం కోసం విద్యా బాలన్ ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నట్టు తెలుస్తోంది. స్మిత పుట్టిపెరిగిన ప్రాంతాల్లో ఆమె స్వయంగా పర్యటించి, స్మిత పడిన కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోనుంది. ఇందుకోసం చెన్నైతో పాటు.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కూడా ఆమె పర్యటించనుంది.ఈ విషయమై విద్యాబాలన్ మీడియాతో మాట్లాడుతూ నిజ జీవిత గాథల్ని తెరకెక్కించేటపుడు కొన్ని ప్లాబ్లంస్‌ని ఫేస్ చేయాల్సి ఉంటుందని, ముందుగానే వాటిని పరిష్కరించుకుంటే తర్వాత ఇబ్బందులు తగ్గుతాయని అంటోంది. ఆ ఆలోచనతోనే సిల్మ్ స్మిత కుటుంబ సభ్యులు, బంధువులను కలుస్తున్నట్టు బాలన్ చెప్పుకొచ్చింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి