హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ చేపట్టిన లక్ష్యదీక్షకు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి బుధవారం ఉదయం హాజరయ్యారు. రైతు సమస్యలపై విజయవాడలో జగన్ చేపట్టిన 48 గంటల దీక్ష రెండో రోజుకు చేరుకుంది. దీక్షకు వచ్చి వైయస్ జగన్ కు తాను సంఘీభావం ప్రకటించినట్లు సబ్బం హరి చెప్పారు. రాష్ట్ర సమస్యలపై ఎవరు పోరాటం చేసినా తన మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.తమకు ఎవరినీ బ్లాక్ మొయిల్ చేయాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. రైతు సమస్యలపై ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఢిల్లీలో మంగళవారం కలిసిన పార్లమెంటు సభ్యుల్లో తాను కూడా ఉన్నానని, వినతిపత్ర రూపకల్పనలో తాను కూడా పాలు పంచుకున్నానని ఆయన చెప్పారు. తాను పని మీద విశాఖపట్నం వచ్చానని, ఈ సందర్బంగా తాను వైయస్ జగన్ దీక్షకు వచ్చి సంఘీభావం తెలిపానని ఆయన వివరించారు. వైయస్ జగన్ కు తొలి నుంచి సబ్బం హరి మద్దతు పలుకుతున్నారు. జనవరి 3వ తేదీ నుంచి విశాఖపట్నంలో చేపట్టే ఓదార్పు యాత్రకు కూడా ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి