దేశంలో నెంబర్‌వన్ స్థానంలో ఉన్న రాజధానిలో నివాసముంటున్న ఢిల్లీ యువతులు మద్యం సేవించడంలో దూసుకుపోతున్నట్లు లెక్కలు చెపుతున్నాయి. వారాంతం వస్తే చాలు... మగువలు మత్తులో చిత్తైపోతున్నారు.కమ్యూనిటీ ఎగైనెస్ట్ డ్రంకెన్ డ్రైవింగ్ సంస్థ ఇటీవల నగరంలోని పబ్బుల్లో సర్వే చేపట్టింది. ఈ సర్వేను సుమారు వెయ్యిమందిపై సర్వే జరిపింది. ఈ సర్వేలో 34 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళల్లో 40 శాతం ప్రతి వారం మద్యం సేవిస్తున్నారని తేలింది.ఇక 15 నుంచి 24 ఏళ్ల వయస్సు గలవారిలో 37 శాతం మహిళలు మద్యాన్ని తొలిసారి రుచి చూస్తున్నట్లు తేలింది. మొత్తమ్మీద వీరు వారానికి మద్యంకోసం వెయ్యి రూపాయల వరకూ ఖర్చు చేస్తారని ఆ సంస్థ సర్వేలో వెల్లడైంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి