విశాఖపట్నం(విశాల విశాఖ): జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంత్‌కుమార్ నియమితులయ్యారు. గతంలో ఇన్‌చార్జ్ మంత్రిగా కన్నా లక్ష్మీనారాయణ వ్యవహరించేవారు. జిల్లా సమీక్ష మండలి (డీఆర్సీ) సమావేశాలకు ఇన్‌చార్జ్ మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.ఈ ఏడాది జూలై మూడవ వారంలో జరిగిన డీఆర్సీ సమావేశం తరువాత నవంబర్ 27న సమావేశమయ్యేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే రోశయ్య స్థానంలో ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో కొత్త మంత్రివర్గం ఏర్పడి, ఇన్‌చార్జీలు రద్దయ్యారు. శుక్రవారం ముఖ్యమంత్రి జిల్లాల వారీ ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. డీఆర్‌సీ ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాల్సి ఉంది. గత సమావేశం జరిగి ఐదు నెలలు గడిచిపోయాయి. మంత్రి వట్టి బాధ్యతలు తీసుకొని జిల్లాకు వస్తే జనవరి మొదటి వారంలో డీఆర్‌సీ సమావేశం నిర్వహించే అవకాశముంది.:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి