* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

15, డిసెంబర్ 2010, బుధవారం

జగన్‌ వైపు ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లు చూపు

మేయర్‌ పీఠానికి బీటలు?
నగరంలో ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లు జగన్‌ వైపుమొగ్గుచూపుతున్నారు. జగన్‌ పార్టీ పెడితే ఆ పార్టీలో చేరడానికి పావులు కదుపుతున్నారు. అదేగానీ జరిగితే మేయర్‌ పీఠానికి బీటలు వారే పరిస్థితి రానుంది. ఇప్పటికే మేయర్‌కు మద్దతు ఇచ్చిన నలుగురు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు జగన్‌ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకంపనలు మేయర్‌ పులుసు జనార్థనరావుకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.మేయర్‌గా ఎన్నికైన ఆరునెలల నుంచే పులుసు జనార్థనరావుపై అధికారపక్ష సభ్యులే వ్యతిరేకించి పీఠం నుంచి దింపేందుకు గతంలో తీవ్ర ప్రయత్నాలు చేసిన సందర్భాలున్నాయి. ఉన్నతశ్రేణి నాయకుల జోక్యంతో వివాదాలు సద్దుమనగడం పరిపాటుగా వస్తున్న పరిణామం. పరోక్షంగా ఎన్నుకోబడిన మేయర్‌ను నాలుగేళ్ల వరకూ ఆయనపై అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు అవకాశం లేదు. మేయర్‌ తనంతట తాను స్వయంగా రాజీనామా చేస్తే తప్ప, కొత్తగా వేరొకరిని ఎంపిక చేయలేని పరిస్థితి. త్వరలో నాలుగేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో అవిశ్వాసం తీర్మానం పెట్టడానికి టిడిపి పావులు కదుపుతోంది.
కాగా, ప్రస్తుతం జగన్‌ పార్టీవైపు ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లు మొగ్గు చూపుతున్నారు. గాజువాక ప్రాంతానికి చెందిన ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లు తిప్పల నాగిరెడ్డి, చొప్పా నాగరాజు, ఇమిలి జ్వాలతోపాటు కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ ఉరుకూటి అప్పారావు జగన్‌కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, జగన్‌తో కలిసి మంతనాలు కూడా సాగించినట్లు తెలిసింది. బుధవారం ఒకటో వార్డు కార్పొరేటర్‌ (ఇండిపెండెంట్‌ అభ్యర్థి) కొవగాపు సుశీల భర్త సుధాకర్‌, తోపాటు మరికొంతమంది ద్వితీయశ్రేణి నాయకత్వం జగన్‌కు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు. జగన్‌ పర్యటనలోగా ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లతోపాటు మరికొంత మంది కాంగ్రెస్‌ కార్పొరేటర్లు జగన్‌కు మద్దతివ్వడంతోపాటు మేయర్‌కు ఇచ్చిన మద్దతును ఉపసంహరించుకొనేలా వ్యూహం కొనసాగుతోంది. డిప్యూటీ మేయర్‌ దొరబాబు ఇదే అదునుగా చేసుకొని మేయర్‌ పులుసు జనార్థనరావు అసంతృప్తివర్గాన్ని తనవైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అసంతృప్తి జ్వాలలను సద్దుమనిగించేందుకు రెండురోజుల క్రితం మేయర్‌ ఏర్పాటు చేసిన అరకు టూర్‌ వర్కవుట్‌ కాలేదు. ఊహించిన స్థాయిలో సభ్యులు టూర్‌కు హాజరుకాలేదు.టిడిపికి 33 మంది కార్పొరేటర్లు ఉండగా, కాంగ్రెస్‌కు 27 మంది ఉన్నారు. 9 మంది ఇండిపెండెంట్లు, ఎక్స్‌అఫిషియో మెంబర్లుగా ఉన్న మంత్రులు పురంధేశ్వరి, బాలరాజు, ఎమ్మెల్యేలు ద్రోణంరాజు శ్రీనివాస్‌, తైనాల విజయకుమార్‌, మళ్ల విజయప్రసాద్‌, ఎంపీ సబ్బంహరితో కలిసి కాంగ్రెస్‌ బలం 42కు చేరుకుంది. ఎక్స్‌ అఫిషియో సభ్యులు వెలగపూడి కలిపి టిడిపి బలం 37కు చేరుకుంది. ఇండిపెండెంట్‌ కార్పొరేటర్లు 9 మంది ఉపసంహరించుకొన్నట్లయితే కాంగ్రెస్‌ బలం 33కు పడిపోనుంది. మేయర్‌ పీఠాన్ని దక్కించుకొని నగరంలో ఓటింగ్‌కు పెంచుకోవడానికి టిడిపి ప్రయత్నిస్తోంది. ఇది ఎంతవరకు ఫలిస్తుందో వేచిచూడాల్సిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి