15, డిసెంబర్ 2010, బుధవారం
హైదరాబాద్ చేరుకున్న శ్రీకృష్ణ కమిటీ సభ్యులు
హైదరాబాద్ : శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ముంబయి నుంచి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి ఈ ఉదయం 10.55కు చేరుకున్నారు. అనంతరం నేరుగా లేక్‌వ్యూ అతిథి గృహానికి బయలుదేరి వెళ్లారు. కమిటీ సభ్యులు మధ్నాహ్నం 12 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఉన్నతాధికారులతో భేటీ కానున్నారు. 12.30కు గవర్నర్, 2.15కు ముఖ్యమంత్రితో కమిటీ సమావేశం కానుంది. 3 గంటలకు పార్టీల నేతలు, ప్రభుత్వ సీనియర్ అధికారులతో ఇష్టాగోష్టి నిర్వహించనున్నారు. సాయంత్రం 4.15కు కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. రాష్ట్రంలో శ్రీకృష్ణ కమిటీ చివరి అధికారిక పర్యటన ఇదే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి