25, డిసెంబర్ 2010, శనివారం
98 పరుగులకే కుప్పకూలిన ఆసీస్
మెల్‌బోర్న్: ఇంగ్లాండ్ దెబ్బకు కంగారూలు కంగుతిన్నారు. తొలి ఇన్నింగ్స్‌లోనే చేతులెత్తేశారు. మెల్‌బోర్న్‌లో ఇవాళ ఉదయం ప్రారంభమైన యాషెస్ సిరీస్‌లోని నాలుగో మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 98 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసి ఆసీస్‌ను కట్టడి చేసింది. ఆసీస్ బ్యాట్స్‌మన్స్‌లో వాట్సన్ 5, హ్యూగ్స్ 16, పాంటింగ్ 10, క్లార్క్ 20, హస్సీ 8, స్మిత్ 6, హడిన్ 5, జాన్సన్ 0, సిడిల్ 11, హిల్ఫెన్‌హాస్ 0 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ ట్రెమ్లెట్, జేమ్స్ అండర్సన్ చెరో నాలుగు వికెట్లు తీసుకుని ఆసీస్‌ను అనూహ్యరీతిలో దెబ్బతీశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి