హైదరాబాద్: ఈ నెల 30న గుంటూరులో తెదేపా తలపెట్టిన బహిరంగ సభ పేరును 'రైతుకోసం'గా ఖరారు చేసినట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్దనరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన మాట్లాడారు. ఈ నెల 31న తెలంగాణ ప్రాంత తెదేపా నేతల భేటీలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణ ఇస్తే సంతోషిస్తాంమని, లేకుంటే ఉద్యమిస్తామని చెప్పారు. తెలంగాణపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చేది... తెచ్చేది మీరే అయితే బలగాల మొహరింపులు ఎందుకని ప్రశ్నించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి