భారీ వర్శాలు తుఫానుల వల్ల రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తద్వారా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి తోట నరసింహం పేర్కొన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో రైతాంగ సమస్యలపై చర్చించగా ఆయన సానుకూలంగా స్పందించారని మంత్రి పేర్కొన్నారు. పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి అన్ని విధాలా సానుకూలత వ్యక్తం చేశారని అన్నారు. ప్రభుత్వపరంగా రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే మండలానికి ఒకటి చొప్పున 58 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 10 శాతం వరకూ దెబ్బతిన్న ధాన్యానికి ఎటువంటి విలువ కట్టకుండా కనీస మద్దతు ధర వచ్చే విధంగా మిల్లర్లతో పాటు ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే జిల్లాకు రావలసిన ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని మంత్రి తెలిపారు. అదే విధంగా దెబ్బతిన్న రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి పూర్తి సానుకూలత వ్యక్తం చేసినట్లు మంత్రి నరసింహం చెప్పారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి