15, డిసెంబర్ 2010, బుధవారం
శబరిమల భక్తులకు ప్రత్యేక రైలు
విశాఖపట్నం: శబరిమల వెళ్ళే భక్తుల కోసం తూర్పు కోస్తా రైల్వే ప్రత్యేక రైలును ప్రవేశపెట్టింది. ఈ నెల 19 నుంచి జనవరి 23 వరకు ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. విశాఖపట్నంలో బయలుదేరే ఈ రైలు కేరళలోని కొళ్లాం(కొట్టాయం తరువాతి హాల్టు) వరకు వెళుతుంది. ప్రతి ఆదివారం విశాఖపట్నంలో ఉదయం 9 గంటలకు బయలుదేరుతుంది. సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు కొళ్లాం చేరుతుంది. తిరిగి అదే రోజు రాత్రి 11.45కు కొళ్లాంలో బయలుదేరి మంగళవారం రాత్రి 7.15కు విశాఖ చేరుతుంది.మార్గమధ్యంలో ఈ రైలు విజయవాడ, రేణిగుంట, జోలార్‌పేట్, పాల్ఘాట్, త్రిచూర్, కొట్టాయం వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి