నెల్లూరు : భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగ శుక్రవారం నెల్లూరులో ప్రారంభం అయ్యింది. ప్రతిఏటా నెల్లూరులోని బారాషహీద్ దర్గా ప్రాంగణంలో ప్రారంభమైన ఈ రొట్టెల పండుగ నాలుగు రోజలు పాటు జరగనుంది. ఈ కార్యక్రమానికి మతాలకు అతీతంగా భక్తులు పోటెత్తారు. దర్గా ప్రాంగణం, స్వర్ణాల చెరువు భక్తులతో కిటకిటలాడుతోంది. ముందు జాగ్రత్తగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.రొట్టెల పండుగకు వస్తున్న భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఈ ఏడాది 8 నుంచి 10 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పారిశుధ్యం లోపించకుండా ఎప్పటి కప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉంచేలా కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. | |
|
17, డిసెంబర్ 2010, శుక్రవారం
ప్రారంభమైన రొట్టెల పండుగ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి