20, డిసెంబర్ 2010, సోమవారం
రూ.87 కోట్ల చేనేత రుణాల మాఫీ: మంత్రి శంకరరావు
హైదరాబాద్: చేనేత రుణ మాఫీకి బడ్జెట్‌లో కేటాయించిన 312 కోట్ల రూపాయలను దశలవారిగా వెచ్చిస్తామని చేనేత శాఖ మంత్రి శంకరరావు తెలిపారు. మొదటి దశలో 87 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తామన్నారు. మరమగ్గాలకు విద్యుత్ సబ్సిడీ కొనసాగించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. చేనేత కార్మికుల ఆత్మహత్యల నివారణకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ఎవరు నిరాహారదీక్షలు చేపట్టినా తప్పులేదన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి