2011 వస్తూనే మ్యాజిక్ ఫిగర్‌తో స్వాగతం పలుకుతోంది. ఏ యేడాది లేనన్నీ మ్యాజిక్ డేట్స్ కొత్త సంవత్సరంలో దాగున్నాయి. మరోవైపు ఇలా ఎక్కువ మ్యాజిక్ డేట్స్ ఉండటం..శుభమా..అరిష్టమా అంటూ చర్చలు మొదలయ్యాయి. కొన్ని జంటలైతే మ్యాజిక్ డేట్స్‌లో ఒక్కటవడానికి సిద్ధమవుతున్నాయి. మ్యాజిక్ డేట్స్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. యేడాదిలో ఏ రోజు మ్యాజిక్ డే వస్తే ఆరోజును తమ లైఫ్‌లో గుర్తిండి పోయే రోజుగా మార్చుకోవడానికి చాలా మంది తహతహలాడుతుంటారు.అయితే ప్రతీ యేడాది మ్యాజిక్ డేట్స్ ఒకటో రెండో ఉంటాయి. కానీ ఈ యేడాది మాత్రం మూడు మ్యాజిక్ డేస్ ఉన్నాయి. దీంతో చాలా మంది ఈ క్రేజీ డేట్స్‌లో వివాహాలు చేసుకోవడానికి రెఢీ అవుతున్నారు. 2011 కొత్త సంవత్సరం వెలకమ్ చెప్పడమే మ్యాజిక్ ఫిగర్‌తో చెబుతోంది. 1/1/2011. దీంతో చాలా మంది న్యూ ఇయర్ + మ్యాజిక్ డేట్ తమ లైఫ్‌లో గుర్తిండిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ యేడాదిలో వచ్చే మరో మ్యాజిక్ ఫిగర్ 11/1/2011. సరిగ్గా పదిరోజుల తేడాతో మరో అరుదైన డేట్ రావడం సమ్‌థింగ్ స్పెషల్‌గా మారింది.ఈ సంవత్సరం వచ్చే మరో క్రేజీ డేట్ 11/11/2011 . దీనికైతే ప్రపంచవ్యాప్తంగా భలే డిమాండ్. ఈ యేడాది 1/10/2010 మ్యాజిక్ డేను చైనీయులు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదే రోజు వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. చైనాలోనే కాదు...ప్రపంచ వ్యాప్తంగా ఈ తేదీ రోజూ చాలా జంటలు ఏకమయ్యాయి. పెళ్లిళ్లే కాదు చాలా ఫంక్షన్స్‌కు ఈ డేట్ మంచిరోజుగా మారింది. అయితే ఎప్పుడూ లేనంతగా ఈ యేడాది ఎక్కువ మ్యాజిక్ ఫిగర్స్ రావడం ఆనందంగా ఉన్నా...అయితే ఈ మ్యాజిక్ డేట్స్ అన్నీ శుభదినాలా..లేక అశుభ సూచికలా అనేది తేలాల్సి ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి