అమరత్వం పొందడం కోసం దేవతలు, గంధర్వులు "అమృతం" సేవించేవారని, ఈ అమృతాన్ని సొంతం చేసుకోవడం కోసం రాక్షసులు యుద్ధాలు చేసేవారని, మహర్షులు సైతం ఘోర తపస్సులు చేసే వాళ్లని పురణాల్లో చదువుకున్నాం..! అయితే అమృతం కేవలం దేవతలకేనా మానవులకు అవసరం లేదా అనుకున్నారో ఏమో గానీ.. బోస్టన్ శాస్త్రవేత్తలు "కృత్రిమ అమృతం" సృష్టించేశారు. దీన్ని మనుషుల శరీరంలోకి ఎక్కిస్తే యమలోక ద్వారాల వరకూ వెళ్లిన వాళ్లు కూడా తిరిగి భూలోకానికి వచ్చేస్తారట..!
అద్భుతాన్ని ఆవిష్కరించారు. బోస్టన్‌లోని మసాచూసెట్స్ జనరల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ హసన్ ఆలం రసాయనాలతో కూడిన అతి శీతల ద్రవాన్ని తయారు చేశారు. ఊహించని ప్రమాదాలు సంభవించినపుడు తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో ఉన్నవారి శరీలంలోకి ఈ శీతల ద్రవాన్ని పంపించడం ద్వారా వారి జీవన ప్రమాణాన్ని గణనీయంగా పెంచవచ్చని ఆయన తెలిపారుసాధారణ శరీర ఉష్ణోగ్రతల వద్ద ప్రమాదానికి గురైన వ్యక్తి శరీరంలో ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయి నాలుగు లేదా ఐదు నిమిషాల్లో మెదడు పనిచేయడం ఆగిపోతుంది. ఫలితంగా మరో పది, పదిహేను నిమిషాల్లో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. అయితే అటువంటి వ్యక్తి శరీర నాడుల్లోకి రసాయనాలతో కూడిన "ప్లాస్మా ఎక్స్‌పాండర్స్" అనే అతిశీతల ద్రవాన్ని ఎక్కించడం ద్వారా జీవక్రియలు నెమ్మదించి, ఫలితంగా శరీరానికి ఆక్సిజన్ అవసరం తగ్గుతుందని అలం వివరించారు.ఇందువల్ల శరీర అవయవాలు నిరాఘాటంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోయేలోపే శస్త్రచికిత్సను పూర్తిచేయవచ్చని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ ప్రయోగాన్ని వరాహాల(పందులు)పై విజయవంతంగా పూర్తి చేశామనీ.. త్వరలోనే మనుషులపై కూడా నిర్వహిస్తామని అలం పేర్కొన్నారు. ఈ వైద్య విధానం ద్వారా మృత్యువుతో పోరాడుతున్న వారిలో దాదాపు 90శాతం మందిని ప్రాణదానం చెయ్యొచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఫ్రీజింగ్ ట్రీట్‌మెంట్ పద్ధతి:
ఈ పద్ధతిలో వేడి రక్తంలోకి చల్లగా ఉండే ఓ సెలైన్ లాంటి ద్రవాన్ని హృదయం చుట్టూ ఉండే రక్తనాళాల ద్వారా శరీరంలోకి ఎక్కిస్తారు. ఇలా చేయడం వల్ల శరీర ఉష్టోగ్రత ప్రతి నిమిషానికి రెండు డిగ్రీల చొప్పున తగ్గుతుంది. ఇలా తక్కువలో తక్కువ 50 డిగ్రీల ఫారన్‌హీట్ వరకూ శరీర ఉష్ణోగ్రత చేరుకుంటుంది. ఇది మెదడు స్పందనలు ఆగిపోకుండా చేయడమే కాకుండా.. హృదయ స్పందన సజావుగా సాగేలా చేయడం, శరీరంలోని అవయవాలను అదుపులో ఉంచడం చేస్తుంది."శరీర ఉష్ణోగ్రత, మెదడు ఉష్ణోగ్రతను 15 డిగ్రీల లేదా 10 డిగ్రీలకు తగ్గించగలిగితే.. కనీసం 60 నిమిషాల నుంచి 190 నిమిషాల వరకూ రక్షణ కల్పించవచ్చు" అని హసన్ అలం తెలిపారు. ఇప్పటికే ఈ తరహా ఫ్రీజింగ్ టెక్నిక్‌ను "ఏల్ న్యూ హెవెన్ హాస్పిటల్"లో హృద్రోగ సమస్యలతో బాధపడే వారికి కోల్డ్ ట్రీట్‌మెంట్ విధానాన్ని శస్త్రచికిత్సలలో ఉపయోగిస్తున్నారు. హసన్ ఆవిష్కరించిన ఈ అధ్భుత వైద్యవిధానం వైద్య చరిత్రలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌కు చెందిన డా. కెవిన్ ఫాంగ్ అభిప్రాయపడ్డారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి