రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి
పసుపులేటి బాలరాజు
విశాఖపట్నం(విశాల విశాఖ) అకాల వర్షాల మూలంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పసుపులేటి బాలరాజు హామీ ఇచ్చారు. ఆదివారం ఉదయం ఆయన ఆనందపురం మండలం పెద్దిపేట పంచాయితీ పల్లెపేట గ్రామంలో నీటమునిగిన వరిపనలను పరిశీలించారు. ఆయనతో పాటుగా మాజీ మంత్రి పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ కూడా పంట నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బాలరాజు మాట్లాడుతూ రైతులు కష్టబడి పండించిన వరిపంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాల వల్ల పంట పాడైపోవడం, చాలాచోట్ల కోసిన పనలు, కుప్పలు కూడా వర్షాలకు నీటిలో మునిగిపోయాయన్నారు. నష్టాల్లో వున్న రైతులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పేందుకు, వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు పర్యటనకు వచ్చామన్నారు. తాను ప్రత్యక్షంగా చూసిన నష్టాన్ని పిసిసి నాయకులైన డి.శ్రీనివాస్‌కు స్వయంగా చూపించి పరిస్థతిని వివరించినట్లు తెలిపారు. రంగు మారిన, తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. అధికార్లు పంటనష్టాన్ని అంచనా వేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక అంచనాల మేరకు జిల్లాలో సుమారు లక్ష ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు అంచనావేసారని, ఎక్కువగా వరి పంటకు సుమారు 80వేల ఎకరాల మేర నష్టం జరిగిందన్నారు. రైతులకు పంట నష్టంతో పాటు, పంట భీమా, సబ్సిడీలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. రైతు రుణాలను రీషెడ్యూల్ చేయిస్తామని, రబీలో విత్తనాల సరఫరా, ఎరువుల సరఫరాతో పాటు నష్టాన్ని పూడ్చు కొనేందుకు రైతులకు కావలసిన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. ఆనందపురం మండలంలో 834 యకరాల వరిపొలం నీట మునిగి 1101 మంది రైతులు నష్టపోయినట్లు 977 యకరాలలో కూరగాయల తోటలు దెబ్బతిని 2530 మంది రైతులకు నష్టం జరిగినట్లు అధికారికంగా గుర్తించామన్నారు. మండలంలో 139 ఇళ్లు పాక్షికంగా, 8 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. పెద్దిపాలెం పంచాయితీలో 349 యకరాలలో వరిపంట సాగుచేయగా అందులో 237 యకరాల పంట నీట మునిగి 199 మంది రైతులకు అపార నష్టం జరిగిందన్నారు. 156 యకరాలలో కూరగాయల తోటలు దెబ్బతిన్నాయని తెలిపారు. డి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో జరిగిన పంట నష్టం గూర్చి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. తడిచిన, రంగుమారిన ధాన్యం కొనుగోలు చేసేందుకు, పంటల భీమా, విత్తనాల సరఫరాకు ఇంకా రైతులకు అవసరమైన సహాయాన్ని అందించ వలసినదిగా సిఫారసు చేస్తామన్నారు. ఈ పర్యటనలో భీమిలి శాసన సభ్యులు ఎమ్.శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర శాసన సభ్యులు తైనాల విజయకుమార్, అదనపు జాయంట్ కలక్టరు ఎస్.సత్యనారాయణ, విశాఖపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.ప్రభాకరరావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు భద్రాచలం, తహశీల్దార్ పి.ఎ.పి.స్వౌమి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి