13, జనవరి 2011, గురువారం
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ సంక్రాంతి శుభాకాంక్షలు
హైదరాబాద్ : సంక్రాంతి పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, తెలుగు వారందరికీ గవర్నర్ నరసింహన్ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వికాసానికి, శాంతికి, ఆనందోత్సహాలకు ఈ పండగ నాంది కావాలని ఆకాంక్షించారు. అన్నదాతలకు ముఖ్యమైన పండగ అయిన సంక్రాంతి సందర్భంగా సమాజానికి అన్ని విధాలా శుభం కలగాలని కోరారు. గత ఏడు ప్రకృతి వైపరీత్యాలతో నష్టాల పాలైన రైతులు ఈసారి పాడిపంటలతో సుసంపన్నం కావాలని గవర్నర్ అభిలషించారు. అందరికీ జయం, విజయం, శాంతి, సమృద్ధి కలగాలని గవర్నర్ సతీమణి విమలా నరసింహన్ ఆకాంక్షించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి