* # మళ్లీ భేటీ అయిన బీఏసీ # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # వంతెనపై నుంచి పడిన స్కూల్‌ బస్సు : 10 మృతి # జయపై భగ్గుమన్న కరుణానిధి # కింగ్‌ఫిషర్‌ విమాన సర్వీసుల రద్దు # సీబీఐ పిటీషన్‌ విచారణ ఎల్లుండికి వాయిదా # బాబు,కిరణ్‌ సర్కారు కుమ్మక్కు : జగన్‌ # బీజేపీ ఎమ్మెల్యేలకు ఢిల్లీ పిలుపు # మిశ్రాకు మద్దతుపై సిన్హా ఫైర్‌ # పట్టువీడని యడ్డీ # పోలీసులపై ఈసీకి నాగం ఫిర్యాదు # భవానీ హైల్యాండ్‌ ప్రైవేటు పరంపై...వాదనలు # కోనేరు బెయిల్‌ పిటీషన్‌ విచారణ వాయిదా # మంత్రి మోపిదేవిని విచారిస్తున్న సీబీఐ # భాను కోసం సీఐడీ వేట # ఏసీబీ అదుపులో మద్యంవ్యాపారి # ప్రిన్సిపాల్‌ వేధింపులతో విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం # అర్ధాంతరంగా ముగిసిన బీఏసీ భేటీ # ఏసీబీకి పట్టుబడిన గ్రామకార్యదర్శి # ఫైనల్‌ ఎంబీబీఎస్‌(పార్ట్‌-2) ఫలితాలు విడుదల # విదేశాల్లో శ్రీనివాస కల్యాణాలపై టీడీపీ ప్రణాళిక # టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌

13, డిసెంబర్ 2010, సోమవారం

ఆటోల సమ్మె యథాతథం

హైదరాబాద్‌(విశాల విశాఖ): చర్చలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందినా సమ్మెను యథాతధంగా కొనసాగించాలని ఆటో సంఘాలు నిర్ణయించాయి. సోమవారం దీక్ష చేపట్టిన ఆటో సంఘాల నాయకులు సాయంత్రం విరమించారు. మొత్తం 16 డిమాండ్లతో ఆటో సంఘాలు సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునిచ్చాయి. ఉదయం 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి 'చలో అసెంబ్లీ' కార్యక్రమం చేపడతామని ఆటో పర్యవేక్షణ, పోరాట సమితి ప్రకటించింది. సాయంత్రం 4 గంటలకు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో చర్చలకు వెళతామని.. సఫలమైతే విరమిస్తామని ఆటో పర్యవేక్షణ, పోరాట ప్రతినిధులు వి.కిరణ్‌, సత్తిరెడ్డి తెలిపారు. మీటర్‌ ఛార్జీల పెంపు, సంక్షేమ బోర్డు ఏర్పాటు, డ్రైవింగ్‌ లైసెన్స్‌కు 8వ తరగతి అర్హతగా ప్రకటించడం, స్పెషల్‌ డ్రైవ్‌ పేరిట పోలీసుల వేధింపుల్ని ఆపడం.. ప్రధాన డిమాండ్లుగా ఆటో సంఘాల నేతలు పేర్కొంటున్నారు.ఆర్టీసీ, ఎం.ఎం.టి.ఎస్‌. అదనపు సేవలు.. ఆటోల సమ్మెను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ, రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ పరంగా రోజువారీ తిరిగే 3,500 బస్సులకు అదనంగా 500 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఇతర జిల్లాల బస్సులు నగరానికి వచ్చేటప్పుడు, నగరం నుంచి వెళ్లేటప్పుడు అన్ని బస్టాపుల్లో ఆగి ప్రయాణికులను ఎక్కించుకుంటాయి. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రూ.10కే ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించామని గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఇ.డి. గుంటి జయరావ్‌ తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఏర్పడితే 9959226160, 9959226154 నెంబర్లకు ఫోన్‌ చేసి తెలపాలని సూచించారు. నగరంలో 12 ప్రత్యేక ఎంఎంటీఎస్‌ సర్వీసులను రైల్వే శాఖ అదనంగా నడపనుంది. సికింద్రాబాద్‌నాంపల్లి, నాంపల్లిలింగంపల్లి, లింగంపల్లి సికింద్రాబాద్‌ మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ప్రయాణికుల రద్దీ, అవసరాలకు అనుగుణంగా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మరిన్ని సర్వీసులు పెంచుతారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి