కొలంబియా: కొలంబియాలో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో 200 మందికి పైగా మృతి చెందారు. దేశంలో రెండవ పెద్ద నగరమైన మెడిల్లిన్ నగరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అక్కడ కొన్ని వారాలుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగి ఇళ్లపై పడ్డాయి. దీంతో వాటికింద పడిన ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఇళ్లలోని వారు సజీవసమాధి అయ్యారు. ప్రభుత్వం తక్షణమే సహాయ చర్యలు చేపట్టింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి