గుంటూరు: రైతుల కష్టాలపై జాతీయ వ్యవసాయ విధానం తీసుకురావాలని ప్రరాపా అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. రైతు పరామర్శ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో రెండో రోజు పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలు జరగకుండా ఉండేందుకు వారికి కౌన్సెలింగ్ అవసరమని చెప్పారు. కౌలు రైతులకు ప్రస్తుతమున్న నిబంధనలు సడలించి ఉదారంగా ఆదుకోవాలని కోరారు. విద్యార్థులపై కేసుల ఎత్తివేత అంశంపై ఆయన మాట్లాడుతూ... కేసుల ఎత్తివేత అభినందనీయమన్నారు. విద్యార్థులు కానివారి వివరాలు బహిరంగపర్చాలని చిరంజీవి డిమాండ్ చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి