28, డిసెంబర్ 2010, మంగళవారం
బాలలకు ఆరోగ్య రక్ష
విశాఖపట్నం(విశాల విశాఖ): ప్రాథమిక స్థాయిలో చదుతున్న విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు. 'జవహర్ బాల ఆరోగ్యరక్ష' పేరుతో రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కార్డులు అందజేసినట్లు రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి సాయిబాబు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 2.70 లక్షల కార్డులు అందజేసినట్లు పేర్కొన్నారు. 1 నుంచి ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులకు జవహార్ బాల ఆరోగ్యరక్ష పధకం వర్తిస్తుందని తెలిపారు. ఈ పథకంగా ద్వారా 12 సంవత్సరాల వయసులోపు ఉన్న విద్యార్థుల ఆరోగ్యం పరిరక్షించడానికి ప్రభుత్వమే బాధ్యతగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఇందుకోసం వైద్య బృందాలను ఏర్పాటుచేశారు. ప్రతి నెల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు వైద్య బృందాలు వెళ్లి విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తారు. దగ్గరలో ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. అవసరమైన వారికి మందులు అందజేస్తామని తెలిపారు. ప్రాథమిక ఆసుపత్రి స్థాయిలో వైద్యం చేయలేని వ్యాధులకు వేరే ఆసుపత్రులకు తరలిస్తారు. దీని ద్వారా ప్రతి నెలలో ఒక రోజు వైద్యపరీక్షలు నిర్వహించి ప్రాథమిక స్థాయిలో గుర్తించి నివారించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి